Asianet News TeluguAsianet News Telugu

15న రవి ప్రకాష్ పోలీసుల ముందుకు రావాల్సిందే: లేదంటే...

పోలీసులు ఇప్పటికే రవిప్రకాష్ కు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. సిఆర్పీసి 160 కింద వారు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే, రెండు సార్లు కూడా రవిప్రకాష్ డుమ్మా కొట్టారు. దీంతో సీఆర్పీసి 41 కింద నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Ravi Prakash must attend May 15 questioning
Author
Hyderabad, First Published May 14, 2019, 10:56 AM IST

హైదరాబాద్: టీవీ 9 మాజీ సిఈవో రవిప్రకాష్ ఈ నెల 15వ తేదీ బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన రేపు బుధవారం ఉదయం 11 గంటలకు వారి ముందుకు రావాల్సి ఉంది. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీఆర్పీసి 41 కింద నోటీసులు జారీ చేయనున్నారు. 

పోలీసులు ఇప్పటికే రవిప్రకాష్ కు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. సిఆర్పీసి 160 కింద వారు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే, రెండు సార్లు కూడా రవిప్రకాష్ డుమ్మా కొట్టారు. దీంతో సీఆర్పీసి 41 కింద నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ సెక్షన్ కింద నోటీసు జారీ చేసిన తర్వాత కూడా హాజరు కాకపోతే రవిప్రకాష్ ను వారంట్ లేకుండా, మెజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా కూడా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. 15వ తేదీన విచారణకు హాజరు కాకపోతే రవిప్రకాష్ ను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. 

అలంద మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి. కౌశిక్ రావు చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాష్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీవీ9 మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎంకెవిఎన్ మూర్తి రెండు సార్లు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

మూర్తి నుంచి కీలక సమాచారం: రవి ప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం?

ఫోన్లు స్విచ్ఛాఫ్, అజ్ఞాతంలో రవిప్రకాశ్: పోలీసుల గాలింపు

టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios