హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌తో పాటు సీనీ నటుడు శివాజీ‌కి హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు నోటీసులు జారీ చేశారు.  రవిప్రకాష్ భార్య ఈ నోటీసులను  తీసుకొన్నారు.

టీవీ9 సంస్థలో వాటాల కొనుగోలుకు సంబంధించిన విషయంలో వివాదం నెలకొనడంతో  అలంద సంస్థ కార్యదర్శి కౌశిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవిప్రకాష్  ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 

ఈ సమయంలో రవిప్రకాష్ ఇంట్లో లేరు.  రవిప్రకాష్ భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాడు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు కోరారు. రేపు ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులో కోరారు.

మరో వైపు ఇదే కేసులో సినీ నటుడు శివాజీకి కూడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీవీ9 కార్యాలయంలో సోదాల సమయంలో కొన్ని కీలకమైన హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీవీ9 సంస్థ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత వార్తలు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు