Asianet News TeluguAsianet News Telugu

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ పదవి నుండి రవి ప్రకాష్‌ను తొలగించాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Raviprakash revmoved as ceo post from tv9
Author
Hyderabad, First Published May 9, 2019, 1:16 PM IST

హైదరాబాద్: టీవీ9 సీఈఓ పదవి నుండి రవి ప్రకాష్‌ను తొలగించాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మెజారిటీ వాటాదారుల హక్కుల అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు  రవిప్రకాష్‌ పాల్పడ్డారని అలంద సంస్థ ఆరోపిస్తోంది.

కంపెనీలో 90 శాతానికి పైగా వాటాను కొత్త యాజమాన్యం తీసుకొంది. అయితే కంపెనీ నిర్వహణలో రవి ప్రకాష్ అడ్డుపడుతూ కంపెనీల  చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా  వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపణలు చేస్తోంది.

సంస్థ ప్రయోజనాలకు సంబంధించి రవిప్రకాష్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడ పెట్టింది. సంస్థకు హాని కల్గించే ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులతో కుమ్మకై ఫోర్జరీ పత్రాలను సృష్టించారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. 

ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉంది.ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.  

ఏబీసీఎల్ లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకొంది. 

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని కూడ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యదర్శి కౌశికర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం నాడు రవిప్రకాష్ ఇంట్లోనూ, కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు.
 

సంబంధిత వార్తలు

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios