హైదరాబాద్: టీవీ9 యాజమాన్య వివాదం విషయమై ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు కొత్త నిర్ణయాలను ప్రకటించనున్నారు.

శుక్రవారం సాయంత్రం  తాజ్ డెక్కన్ హోటల్ లో  మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్‌లోని గోల్డెన్ మైల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాడు ఉదయం ఏబీసీఎల్ బోర్డు సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో కొత్త సీఈఓను ఎన్నుకొన్నారని తెలుస్తోంది. సింగారావును కొత్త సీఈఓగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

బోర్డు నిర్ణయాలను ఈ మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు.  టీవీ9లో చోటు చేసుకొన్న వివాదంలో రవి ప్రకాష్‌ను తొలగించినట్టుగానే  ప్రచారం సాగుతోంది. కానీ,ఈ విషయమై స్పష్టత రాలేదు ఈ విషయాలపై బోర్డు  తన నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు