హైదరాబాద్: టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదంపై పోలీసుల విచారణకు  టీవీ9 ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తి శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట మూర్తి విచారణకు హాజరయ్యారు.

టీవీ9 సీఈఓ రవిప్రకాష్,  సినీ నటుడు శివాజీకి కూడ ఈ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ ఇవాళ విచారణకు హాజరుకాలేదు. వీరిద్దరూ కూడ ఇవాళ విచారణకు హాజరుకాకపోతే మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

తన సంతకం ఫోర్జరీ చేశారని అలంద మీడియా సంస్థ కార్యదర్శి  కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  టీవీ9 కార్యాలయంలో  గురు, శుక్రవారాల్లో సోదాలు నిర్వహించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగానే టీవీ9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ ను కూడ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో  దేవేంద్ర అగర్వాల్‌ను పోలీసులు విచారించారు.

సంబంధిత వార్తలు

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు