Asianet News TeluguAsianet News Telugu

మూర్తి నుంచి కీలక సమాచారం: రవి ప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం?

పోలీసుల విచారణలో మూర్తి కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే రవిప్రకాశ్‌, శివాజీలను అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

TV9 ex CEO Ravi Prakash may be arrested
Author
Hyderabad, First Published May 13, 2019, 7:27 AM IST

హైదరాబాద్‌: సంతకాల ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసుల్లో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. 

ఆదివారం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాకపోవడంతో పోలీసులు రవిప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. 161 సీఆర్‌పీసీ ప్రకారం సాక్షుల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తామని, ఫిర్యాదుదారు పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవం ఉంటే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తామని పోలీసులు అంటున్నారు. 

ఈ సెక్షన్‌ ప్రకారం కోర్టు నుంచి ఎలాంటి వారెంట్‌ అవసరం లేకుండానే అరెస్ట్‌ చేయవచ్చునని పోలీసులు తెలిపారు. కేసులో టీవీ9 మాజీ డైరెక్టర్‌ ఎంవీవీఎన్‌ మూర్తిని ఆదివారం కూడా ప్రశ్నించారు. ఆయన నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే రవిప్రకాశ్‌, సినీ నటుడు శివాజీకి సీఆర్‌పీసీ 41ఏ కింద త్వరలో నోటీసులు జారీ చేస్తామని అంటున్నారు. 

మరుసటి రోజే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తామని, ఒకవేళ పోలీసుల ఎదుట హాజరుకాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసు అధికారులు అంటున్నారు. తాము ఇప్పటివరకు రవిప్రకాశ్‌, శివాజీ కోసం గాలించలేదని స్పష్టం చేశారు.

41ఏ నోటీసులకు స్పందించకపోతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకుంటామని అంటున్నారు. అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదులతో రవిప్రకాశ్‌, శివాజీలతో పాటు మరికొందరిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

పోలీసుల విచారణలో మూర్తి కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే రవిప్రకాశ్‌, శివాజీలను అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

ఫోన్లు స్విచ్ఛాఫ్, అజ్ఞాతంలో రవిప్రకాశ్: పోలీసుల గాలింపు

టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios