టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. సొంత ప్రయోజనాల కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై టీవీ9 కొత్త యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో భాగంగా శనివారం సైబర్ క్రైమ్, సైబరాబాద్ పోలీసులు రవిప్రకాశ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు..

ఇంట్లో ఉన్న వారిని ప్రశ్నించగా రవిప్రకాశ్ బయటకు వెళ్లారని, ఎక్కడకు వెళుతున్నారో చెప్పలేదని వారు వెల్లడించారు. దీంతో ఆయన సన్నిహితులు, టీవీ9 ఉద్యోగులను ప్రశ్నించగా వారు కూడా తమకు తెలియదని చెప్పినట్లుగా సమాచారం.

రవిప్రకాశ్ సెల్‌ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా నిర్థారణకు వచ్చామని, గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని శనివారం మరోసారి పోలీసులు ప్రశ్నించారు. కాగా నటుడు శివాజీకి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు