MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్

Weather Update :  నేడు (మార్చి 6) ఈ సమ్మర్ లోనే ఇప్పటివరకు నమోదుకాని అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 06 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్
Image Credit : Freepik

తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్

Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు క్రమక్రమంగా ముదురుతున్నాయి. ఇంకా వేసవి ఆరంభంలో ఉంది... అయినా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు. తెలంగాణలో అయితే 40 డిగ్రీల మార్కుకు అడుగుదూరంలో నిలిచింది టెంపరేచర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే...
Image Credit : PTI

అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే...

నిన్న (మార్చి 5, గురువారం) ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక ఆదిలాబాద్ పట్టణంలో 38.9, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 38.9, ఖమ్మం పట్టణంలో 38.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని నగరం హైదరాబాద్ లో 37 డిగ్రీల హై టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ 35 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

36
ఈ నాలుగైదురోజులు తస్మాత్ జాగ్రత్త...
Image Credit : Freepik

ఈ నాలుగైదురోజులు తస్మాత్ జాగ్రత్త...

రాబోయే నాలుగైదురోజులు ఎండత తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీముఖ్యంగా ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది.

46
 తెలంగాణ వెదర్ మ్యాచ్ అంచనా ఇదే..
Image Credit : freepik

తెలంగాణ వెదర్ మ్యాచ్ అంచనా ఇదే..

ఇవాళ(మార్చి 6, శుక్రవారం) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. నార్త్, ఈస్ట్ తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ లో కూడా 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నాడు. ఈ మూడునాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుంది... కాబట్టి పగటిపూట రోడ్లపైకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.

56
ఏపీలోనూ మండిపోనున్న ఎండలు
Image Credit : pixabay

ఏపీలోనూ మండిపోనున్న ఎండలు

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కృష్ణా జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDMA హెచ్చరించింది.

66
సమ్మర్ లో పాటించాల్సిన జాగ్రత్తలు..
Image Credit : our own

సమ్మర్ లో పాటించాల్సిన జాగ్రత్తలు..

1. టోపి, కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళుతున్నప్పుడు తప్పకుండా వీటినే ధరించాలి.

2. ఎండల నుండి మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.

3. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలి.

4. మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలి.

5. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image2
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Recommended image3
విమోచనం కాదు విలీనం కాదు... సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవమే ఎందుకో తెలుసా? : సీఎం రేవంత్ రెడ్డి
Related Stories
Recommended image1
Weather Report: వ‌చ్చే 4 రోజులు చాలా జాగ్ర‌త్త‌.. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక
Recommended image2
IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved