Asianet News TeluguAsianet News Telugu

టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా

టీవీ9కు సంబంధించి అలంద మీడియా పోలీసులకు మరో ఫిర్యాదు కూడా చేసింది.టీవీ-9 కార్యాలయంలో డేటా చోరీకి గురైందని అలంద మీడియా పోలీసులకు ఇచ్చిన మరో ఫిర్యాదులో ఆరోపించింది. ఇప్పటికే ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Data theft in TV9: RaviPrakash and Shivaji seek time
Author
Hyderabad, First Published May 11, 2019, 7:43 AM IST

హైదరాబాద్‌: టీవీ9 చానెల్ వివాదంలో పోలీసుల విచారణకు ఆ చానెల్ మాజీ సీఈవో, హీరో శివాజీ గైర్హాజరయ్యారు. వారిద్దరు శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తమకు మరో పది రోజుల గడువు కావాలని వారిద్దరు సైబరాబాద్ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. వారి విజ్ఞప్తిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 

టీవీ9కు సంబంధించి అలంద మీడియా పోలీసులకు మరో ఫిర్యాదు కూడా చేసింది.టీవీ-9 కార్యాలయంలో డేటా చోరీకి గురైందని అలంద మీడియా పోలీసులకు ఇచ్చిన మరో ఫిర్యాదులో ఆరోపించింది. ఇప్పటికే ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు గతనెల చివరి వారంలోనే ఇచ్చింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

గురువారంనాటి తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్ లు, బయోమెట్రిక్‌, సీసీ కెమెరా డీవీఆర్‌ , కీలక పత్రాలు, ఇతర సాంకేతిక ఆధారాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కి పంపించనున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టుకు అందజేస్తే అక్కడి నుంచి దర్యాప్తు అధికారులు తీసుకుని తదుపరి దర్యాప్తు చేపడతారు. ఈ ప్రక్రియను వచ్చేవారం పూర్తి చేస్తారని సమాచారం. 

నోటీసులు అందుకున్న టీవీ-9 మాజీ డైరెక్టర్‌ మూర్తి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. టీవీ-9 కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌, ఎన్సీఎల్టీకి లేఖ రాసి కంపెనీ షేర్లకు సంబంధించిన వివరాలు, యాజమాన్య బదిలీ వివరాలు అడిగారు.

సంబంధిత వార్తలు

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios