జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ పీఆర్ ఉన్నత పాఠశాలలో అన్నయ్య అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆయన గతంలోనూ అదే వక్ర బుద్ధి ప్రదర్శించాడు. తల్లిదండ్రుల చేతిలో తన్నులు కూడా తిన్నారు. గత ఏడాది వరకు ఈ తెలుగు బడిపంతులు పొద్దుటూరులో విధులు వెలగబెట్టాడు. ఆ సమయంలో ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ తల్లిదండ్రులు బడి పంతులుకు దేహశుద్ధి చేశారు. అప్పుడు కూడా ఆడపిల్లలను తాకరాని చోట తాకుతూ అసభ్య ప్రవర్తనతో వాళ్లను టార్చర్ చేసినట్లు రోపణలున్నాయి. ఈ బడిపంతులు కు దేహశుద్ధి చేసిన వీడియో కింద ఉంది. అదే వీడియోలో ఆయన గురించి చిన్నారులేమంటున్నారో చూడండి.