Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ.. బొమ్మలరామారంలో రిసార్ట్‌పై దాడి.. నలుగురు నిర్వాహకులు అరెస్ట్..

హైదరాబాద్‌ శివార్లలో రేవ్‌ పార్టీ కల్చర్‌, డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగిపోతోంది. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు అడ్డగా చాలా సీక్రెట్‌గా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

Police raid on rave party in bommalaramaram near hyderabad
Author
First Published Jan 1, 2023, 10:55 AM IST

హైదరాబాద్‌ శివార్లలో రేవ్‌ పార్టీ కల్చర్‌, డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగిపోతోంది. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు అడ్డగా చాలా సీక్రెట్‌గా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిరుమలగిరిలో అడ్వెంచర్ కోవే రిసార్ట్‌పై భువనగిరి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనకు సంబంధించి నలుగురు రేవ్ పార్టీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాదాపు 200 మంది యువతీ యవకులు ఈ రేవ్‌ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios