తోటి విద్యార్ధిని చితకబాదుతూ, బూతులు తిడుతూ.. బండి సంజయ్ కుమారుడి దాడి, వీడియో వైరల్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తోటి విద్యార్ధిపై అతను దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ ర్యాగింగ్ పేరుతో తన తోటి విద్యార్ధిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో బాధితుడిపై భగీరథ్ అసభ్య పదజాలంతో దూషించాడు. అతనితో పాటు స్నేహితులు కూడా బాధిత విద్యార్ధినిని చితకబాదారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాగా వైరల్ అయ్యింది. దీనిని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో భగీరథ్‌పై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే గతంలోనూ భగీరథ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఇలాగే గొడవలకు దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో వర్సిటీ యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.