Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌కి గోవా డ్రగ్స్ కింగ్‌పిన్‌ జాన్‌డిసౌజా... కీలక విషయాలు తెలిపిన పోలీసులు

గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇతనిపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని తెలిపారు. ఈ రాకెట్ వెనుక ఎంత మంది ప్రమేయం వుందన్నది తెలియాల్సి వుందని అధికారులు పేర్కొన్నారు.

police brought Goa Hotel Owner John D'Souza to Hyderabad
Author
First Published Sep 23, 2022, 4:52 PM IST

గోవా డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. గోవాల్ జాన్ క్యాసినో పార్టీలను నిర్వహిస్తూ వుంటాడని.. తన అనుచరుల ద్వారా హిట్‌టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్‌ని సప్లయ్ చేస్తాడని పోలీసులు పేర్కొన్నారు. 1983 నుంచి ఇతను హిల్‌టాప్ రెస్టారెంట్ నడిపిస్తున్నాడని.. ఫేమస్ డీజేలు వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తారని తెలిపారు. వీకెండ్స్‌తో పాటు సీజన్‌లో కొన్ని పార్టీలను ఏర్పాటు చేసి దానికి రూ.3000 నుంచి రూ.5000లు ఎంట్రీ ఫీజు వసూలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఇతనిని గోవాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇతనిపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదని తెలిపారు. ఈ రాకెట్ వెనుక ఎంత మంది ప్రమేయం వుందన్నది తెలియాల్సి వుందని అధికారులు పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం వుందని పోలీసులు తెలిపారు.

ఇకపోతే.. తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారిని అరెస్ట్  చేయడంపై పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖాధికారులు  చర్యలు చేపట్టారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సీటీగా మార్చాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ సరఫరాదారులతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నవారిపై  పోలీసు శాఖ దృష్టి కేంద్రీకరించింది.  హైద్రాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు డ్రగ్స్ కొనుగోలు దారులుగా ఉన్నారని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. మరో వైపు కాలేజీలు, స్కూల్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు గంజాయిని సరఫరా చేస్తున్నవారిపై  ఎక్సైజ్, పోలీస్ శాఖలు దృష్టి కేంద్రీకరించాయి. 

ALso Read:హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా: గోవాలో స్టీఫెన్ డిసౌజాను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు-

హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముంబై నుండి హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసే కీలక నిందితుడు టోనిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పోలీసుల కళ్లుగప్పి టోని ముంబై కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.. 

Follow Us:
Download App:
  • android
  • ios