అతనికి పోర్న్ చూసే అలవాటు ఉంది. దాని కోసం చాలా సైట్లలో తన ఫోటో, ఫోన్ నెంబర్ పెట్టి కాల్ బాయ్ గా పేర్కొన్నాడు. అయినా కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో... ఏకంగా ‘గే’ సైట్లను ఎంచుకున్నాడు. అక్కడ ఓ యువకుడితో పరిచయం పెంచుకొని.. అతని నగ్న చిత్రాలను సేకరించాడు. ఆ తర్వాత వాటిని చూపించి.. బెదిరించి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన నాగోలులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నారాయణ్ పేట జిల్లా కేంద్రం పల్లా అర్జున్ వాడకు చెందిన తూము భరత్ కుమార్(22) బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్ లైన్ లో పోర్న్ వెబ్ సైట్లు, సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆ వెబ్ సైట్లను బ్లాక్ చేసినప్పటికీ.. వేరే అప్లికేషన్ల సహాయంతో వాటిని చూడటం మొదలుపెట్టాడు..

ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించేందుకు పలు వెబ్ సైట్లలో తన పేరు, ఫోన్ నెంబర్లను కాల్ బాయ్ పేర్కొంటూ ఇచ్చాడు. అయితే.. పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ‘ గే’ సైట్లలోకి వెళ్లాడు. అదే సైట్ లో తన ఇంటర్  క్లాస్ మెట్ ఒకడు కనిపించడంతో అతనితో ఆన్ లైన్ డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు.

ఆ యువకుడితో తనని తాను గేగా పరిచయం చేసుకొని.. ఆ యువకుడితో ప్రతిరోజూ చాటింగ్ చేసేవాడు. నగ్నంగా ఫోటోలు కూడా ఇద్దరూ పంచుకునేవారు. చివరకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.