హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో.. ఒకసారి నగరంలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు పేర్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. కాగా.. తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ ముఠా  నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా.. వ్యభిచారం కూడా యదేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు తెలస్తోంది. ఆన్ లైన్ లో  డ్రగ్స్ తోపాటు.. వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యి.. సదరు ముఠాను అరెస్టు చేశారు. విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూశాయి.

గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు యువతుల ద్వారా విటులు, ఇతరులకు ఈ ముఠా డ్రగ్స్ సప్లై చేస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న ముఠా వద్ద నుంచి  200 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఒక నైజీరియన్ నుంచి సమాచారం అందడంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు సమాచారం.  ఈ ముఠా ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్‌ను ఇక్కడికి తెచ్చి..  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.