హైద్రాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పదవికి  పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా ఈ విషయాన్ని శుక్రవారం నాడు ప్రకటించనున్నారు.

స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. స్పీకర్ పదవికి  పోటీ పెట్టకూడదని  విపక్షాలను కేసీఆర్ కోరారు. అయితే ఈ పదవికి పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును కేసీఆర్ ప్రతిపాదించారు.

గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా  రేఖా నాయక్  నామినేషన్ వేశారు. స్పీకర్  పదవికి పోచారం  శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడ రేఖా నాయక్ ఒక్కరే నామినేషన్ వేశారు.

నామినేషన్ దాఖలుకు  సమయం కూడ మించిపోయింది. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒక్కొక్క నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రేపు శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

స్పీకర్ పదవికి పోచారం నామినేషన్ దాఖలు

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి రేఖా నాయక్ నామినేషన్

నేనొస్తేనే బెదురుతున్నారు, కేసీఆర్ వస్తున్నాడు: బాబుపై తలసాని

టీఆర్ఎస్ నేతల ఏపీ టూర్లపై టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని