హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి  మాజీ మంత్రి  పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ పదవికి రేపు ఎన్నిక జరగనుంది.

గురువారం మధ్యాహ్నం పోచారం శ్రీనివాస్ రెడ్డి  అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో  నామినేషన్ దాఖలు చేశారు.తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి  పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును   టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రతిపాదించారు. స్పీకర్‌ ఎన్నిక  ఏకగ్రీవం చేయడం కోసం అన్ని పార్టీలు సహకరించాలని కేసీఆర్   అన్ని పార్టీలను కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ స్పీకర్ పదవికి పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకొంది. దీంతో  పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఎన్నిక ఇక లాంఛనం కానుంది.ఇవాళ ఉదయం  ప్రగతి భవన్‌లో  పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌తో కలిసి గన్‌పార్క్ వద్ద  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.ఆ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.  పోచారం నామినేషన్ దాఖలు సమయంలో  కేసీఆర్, మల్లు భట్టి విక్రమార్క,  బలాల కూడ ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా