కాంగ్రెస్ జైపాల్ రెడ్డి, బిజెపి నాగం గుసగుస (వీడియో లీక్)

కాంగ్రెస్ జైపాల్ రెడ్డి, బిజెపి నాగం గుసగుస (వీడియో లీక్)

వాళ్లిద్దరూ పాలమూరు ఉద్దండ నేతలు. ఒకిరికి ఒకరంటే గౌరవం. ఒకరికి ఒకరంటే అభిమానం. కానీ ఏమైందో ఏమో గత ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసిర్రు. ఇద్దరూ ఓడిపోయి మూడో మనిషి గెలిచారు. ఆ ఓడిపోయిన ఇద్దరెవరంటే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, ప్రస్తుత బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి.

గురు శిష్యుల మాదిరిగా ఉండే వీళ్లిద్దరూ తలపడడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు సీటులో 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నేత ఎపి జితేందర్ రెడ్డి గెలుపొందారు. తర్వాత ఇద్దరూ రియలైజ్ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ వేరు వేరు పార్టీల్లోనే ఉన్నారు. అయితే నాగం బిజెపిలో ఇమడలేకపోతున్నారన్న చర్చ ఉంది కాబట్టి ఆయనను కాంగ్రెస్ లోకి జైపాల్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి సోదరుడి కొడుకు పెళ్లిలో ఇద్దరూ కలుసుకున్నారు. పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. పనిలో పనిగా రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయి. వారి పక్కనే అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఉన్నారు. ఇంతకూ నాగం, జైపాల్ ఏం మాట్లాడుకున్నారో చూడండి. వినండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos