బంగారం లాంటి తన బిడ్డను యశోద హాస్పిటల్ పొట్టన పెట్టుకుందని ఒక కన్నతల్లి తల్లడిల్లింది. జరం వచ్చిందని సికింద్రాబాద్ యశోదలో చేర్పిస్తే.. మలక్ పేట బ్రాంచ్ కు పంపారని ఆమె చెప్పింది. పది లక్షలు కట్టించుకున్న యశోద వైద్యులు చివరకు తన బిడ్డ శవాన్ని ఇచ్చారని తల్లడిల్లిపోయింది. ఆసుపత్రిలో ధర్నాకు దిగింది. ఆసుపత్రి సిబ్బంది మీద దుమ్ము పోసింది. శాపనార్థాలు పెట్టింది. ఆ తల్లి ఆర్తనాదాలు ఈ కింద వీడియోలో చూడండి.

గతంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిఆర్ఓ రవీందర్ కూడా యశోదలో చిన్న ఆపరేషన్ కోసం వెళ్లి శవమై బయటకొచ్చిన విషయం తెలిసిందే.