Asianet News TeluguAsianet News Telugu

నమ్మించి, లైంగికంగా వాడుకుని, గ్యాంగ్ రేప్ చేయించి.. అర్థరాత్రి, రోడ్డు మీదికి తోసేసి...

నమ్మించి మోసం చేసి.. లైంగికంగా వాడుకుని, గ్యాంగ్ రేప్ చేయించి.. అనాథలా రోడ్డు మీదికి తోసేసి పరారైన దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ దుర్మార్గుడు.

Man Forced Woman To Extra Maritial Affair In Jadcherla  - bsb
Author
Hyderabad, First Published Jul 6, 2021, 10:58 AM IST

నమ్మించి మోసం చేసి.. లైంగికంగా వాడుకుని, గ్యాంగ్ రేప్ చేయించి.. అనాథలా రోడ్డు మీదికి తోసేసి పరారైన దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ దుర్మార్గుడు.

ఈ క్రమంలోనే ఓ రోజు బలవంతంగా తన కారులో ఎక్కించుకున్నాడు. మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురి చేశాడు. మొబైల్ ఫోన్, ఫర్సు లాక్కున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిమీద ఆపి బైటికి తోసేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ లో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న 37యేళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేష్ గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలవలేకపోతున్నామని చెప్పాడు.

తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్ నగర్ కు చెందిన మిత్రుడు వెంకటేష్ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న బావ మరిదితో కలిసి మహబూబ్ గనర్ కు వెళ్లారు. 

అక్కడి నుంచి క్రిస్టియన్ పల్లి మీదుగా భూత్పూర్ కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేష్ గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేష్ గౌడ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. 

అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్థరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్ నగర్ లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. 

చివరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చ బాధితురాలి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే నిందితులమీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేస్తోంది. 

సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్ గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతినివ్వలని కోరగా పోలీసులు నిరాకరించారు. ఆ తరువాత విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. 

నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్‌లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్‌ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios