Asianet News TeluguAsianet News Telugu

జనగామ టికెట్ పోరు: పొన్నాలదే గెలుపు, బరి నుంచి కోదండరామ్ ఔట్

చివరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు కోదండరామ్ అంగీకరించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. 

Kodandaram sacrifices Janagaon seat
Author
Hyderabad, First Published Nov 17, 2018, 7:07 AM IST

హైదరాబాద్: ఎన్నికల పోరు నుంచి తెలంగాణ జన సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కోదండరామ్ తప్పుకున్నారు. జనగామ టికెట్ ను ఆయన కాంగ్రెసు నేత పొన్నాల లక్ష్మయ్యకు త్యాగం చేశారు. కోదండరామ్ తో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా చర్చలు జరిపారు. 

చివరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు కోదండరామ్ అంగీకరించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో పొన్నాల లక్ష్మయ్య కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల నాడి కోదండరామ్ కు బాగా తెలుసునని, అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని కుంతియా అన్నారు. కూటమికి కోదండరామ్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. 

కోదండరామ్ అంగీకారంతో జనగామ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకే దక్కింది. కోదండరామ్ కనీస ఉమ్మడి కార్యాచరణ కమిటీ చైర్మన్ గా ఉంటారని కుంతియా చెప్పారు. మహా కూటమి అధికారంలోకి వస్తే ఆ పదవికి క్యాబినెట్ హోదా కల్పిస్తామని చెప్పారు. 

తెలంగాణ ప్రచారంలో సోనియా, రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. మహా కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం సాగిస్తారని చెప్పారు. రాష్ట్రమంతా పర్యటించాలని కోదండరామ్ ను కోరినట్లు ఆయన తెలిపారు.  

కూటమికి పీపుల్స్ ఫ్రంట్ గా నామకరణం చేయాలని కాంగ్రెసు, టిజెఎస్ చర్చల్లో ఓ నిర్ణయానికి వచ్చారు. 

సంబంధిత వార్తలు

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

Follow Us:
Download App:
  • android
  • ios