Asianet News TeluguAsianet News Telugu

Amnesia Pub Rape Case : వీడియోలు ఎందుకు తీశారు? అవి ఎలా బయటికి వచ్చాయి? వైరల్ గా ఎలా మారాయి?

అమ్నీషియా పబ్ రేప్ కేసులో బాధుతురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారని, వాటిని వైరల్ గా ఎవరు మార్చారు.. ఆ వీడియోలు బైటికి ఎలా వచ్చాయి??? ఇవి అందర్నీ వేదిస్తున్న ప్రశ్నలే వీటి కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Jubileehills Gang Rape : Why were the videos taken? How did it goes viral? and who leaked the videos?
Author
Hyderabad, First Published Jun 16, 2022, 8:04 AM IST

హైదరాబాద్ :  జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బెంజ్ కారులో ప్రయాణం చేసేటప్పుడు  బాధితురాలితో వీడియోలు ఎందుకు తీసుకున్నారు? ఆ వీడియోలు ఎలా బయటికి వచ్చాయి?  వైరల్గా ఎలా మారాయి? అన్న అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఐదు రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు వీడియోల గురించి ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. వీడియోలను వాట్సాప్ గ్రూపులోకి పంపించిన సూత్రధారుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇప్పటికే వేల మంది వాట్స్అప్ ద్వారా వీడియోలు షేర్ చేసుకున్నారని,  ప్రసార మాధ్యమాలు, యూట్యూబ్ లోనూ  ఉన్నాయని తెలుసుకున్నారు.వాటిని తొలగించాలంటూ ఆయా సంస్థల ప్రతినిధులు లేఖలు రాశారు.

నిందితులను నేర శైలి గుర్తించేందుకు..
తీవ్ర నేరానికి పాల్పడిన ఆరుగురు నిందితులు ప్రవర్తన, వ్యవహారశైలిని గుర్తించేందుకు పోలీసులు సామాజిక మాధ్యమాలు, నిందితుల ఫోన్ లను పరిశీలిస్తున్నారు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లలో వారు గతంలో పోస్ట్ చేసిన ఫోటోలు, సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలి మెడపై పంటిగాట్లు చేసి ‘టాటూలు’ అనడం, కాన్సూ బేకరి వద్దకు చేరుకుని అందరూ కలిసి ఫోటో తీసుకున్నాక ఫేస్బుక్లో ‘ఇప్పుడే పార్టీ పూర్తయింది’ అని పోస్ట్ చేసిన అంశాన్ని ప్రాధాన్యంగా పరిశీలిస్తున్నారు. నిందితుల వాట్సాప్ సంభాషణలు… రోజు వారి అలవాట్లు,  ధూమపానం, కాలేజీలో వారి ప్రవర్తన వంటి అంశాలపై సమాచారం సేకరించి మానసిక నిపుణుల ద్వారా విశ్లేషించనున్నారు. వారి విశ్లేషణ ఆధారంగా నేర ప్రవృత్తిని అంచనావేసి అభియోగ పత్రాలలో సమర్పించనున్నారు.

Amnesia Pub Rape Case : నిందితుల తల్లిదండ్రులకు నోటీసులు.. కారు డ్రైవర్, యజమానులపై కేసులు..

కీలక సాక్ష్యాధారాలు సేకరణ…
సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో అత్యాచార ఘటనను రుజువు చేసేందుకు అవసరమైన జీవపరిణామ సూక్ష్మక్రిములు, బాధితురాలి వెంట్రుకలు, నిందితుల లో దుస్తుల్లో చిక్కుకున్న అవశేషాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. అత్యాచార ఘటనను సాంకేతికంగానూ నిరూపించేందుకు నిందితులు,  బాధితురాలి ఫోన్ సిగ్నల్, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన కార్లను ‘పరిస్థితులు ఆధారాలు’ (సర్కమ్ స్టెన్సెస్ ఎవిడెన్స్) గా  అభియోగ పత్రాల్లో సమర్పించనున్నారు.  దీంతో పాటు మే 31న కేసు నమోదు అయింది అన్న విషయం తెలుసుకున్న నిందితులు పారిపోయి... చిక్కే వరకు ఒకరితో ఒకరు చేసుకున్న చాటింగ్ లతోపాటు ఇంకా ఎవరితోనైనా చాటింగ్ చేశారా, వివరాలు పంచుకున్నారా అన్న వివరాలనూ సేకరిస్తున్నారు. 

కాగా, సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ఏం చేయనున్నారని తొలి రోజు నుంచే గమనిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు.  జూబ్లీహిల్స్ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఐదుగురు మైనర్లు పోలీసులకు దొరకకుండా పారిపోయారు. ఇదే విషయాన్ని వారు విచారణలో అంగీకరించారు. బంజారా హిల్స్లో ఉంటున్న ఒక నిందితుడి తల్లి అప్పటికే ఊటీలో ఉండగా అక్కడికి చేరుకున్నాడు. మరొకరు నెల్లూరు ప్రాంతంలోని దర్గాకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. మరో ఇద్దరు మధ్యవర్తుల ఆధారంగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఏ-5గా ఉన్న మైనర్ గుల్బర్గా ప్రాంతంలో  చిక్కినట్లు సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios