చిన్నారులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఆ టీచర్ కీచకుడి అవతారమెత్తిండు. ఆరో తరగతి ఆడపిల్లలను సైతం వదలకుండా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆడపిల్లలను గలీజు భాషలో తిడుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బడి పిల్లలే స్వయంగా మీడియాకు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.

జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ పీఆర్ ఉన్నత పాఠశాలలో అన్నయ్య అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆడపిల్లలను తాకరాని చోట తాకుతూ అసభ్య ప్రవర్తనతో వాళ్లను టార్చర్ చేస్తున్నాడు. అసభ్యకరమైన భాషలో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆయన గురించి చిన్నారులేమంటున్నారో కింద వీడియోలో చూడండి.

ఈ టీచర్ అన్నయ్య సక్కదనం గతంలో కూడా ఏమంత గొప్పగా లేదు. ఏడాది కిందట పొద్దుటూరులో టీచర్ ఉద్యోగం వెలగబెట్టే సమయంలో కూడా ఆడపిల్లలను లైంగికంగా వేధించిన దాఖలాలున్నాయి. అప్పుడు ఈ టీచర్ అన్నయ్యను పొద్దుటూరు జనాలు ఉరికించి కొట్టారు. ఆ వీడియో అప్పట్లో టీచర్ కు దేహశుద్ధి చేసే వీడియో టీవిల్లో ప్రసారమైంది. ఆ వివరాలు కీచక టీచర్ పార్ట్ 2లో చూద్దాం.