
సెంటిమెంట్ ను బ్రేక్ చేశా: ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)
సెంటిమెంట్ ను బ్రేక్ చేశా: ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)
అటవీ,పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ,ల మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వారు రెండోసారి గెలవరనే సెంటిమెంట్ ను బ్రేక్ చేశానని చెప్పుకున్నారు. ఈసారి తనకు దేవాదాయ న్యాయ అటవీ శాఖలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
2 కోట్ల పది లక్షలు ప్రతి నెల 3వేల 645 దేవాలయాలకు దూప దీప నైవేద్యాలకు ఇస్తున్నామని ఆయన అన్నారు. మే ఒకటి నుండి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దళిత వాడల్లో దేవాలయాలకు 10 లక్షల గ్రాంట్లు అందజేస్తున్నామని అన్నారు.
అటవీ శాఖపై సీఎం ఇప్పటికే రివ్యూ చేశారని గుర్తు చేస్తూ జంగల్ బచావో, జంగల్ బడావో పేరుతో ముందుకు వెళ్తామని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు అటవీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి అడవుల రక్షణకు చర్యలు చేపడతామని అన్నారు.
హైకోర్టు విభజనతో ప్రధాన సమస్య తీరిందని,
త్వరలోనే జిల్లా హైకోర్టు భవనాల నిర్మాణాలు న్యాయశాఖ సిబ్బంది క్వార్టర్స్ నిర్మిస్తామని చెప్పారు.