Asianet News TeluguAsianet News Telugu

వృత్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి డ్రగ్స్ దందా...

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న యువకులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సాప్ట్ వేర్ ఇంజనీర్లు ప్రముఖ కంపెనీల్లో మంచి వేతనాలకే పనిచేస్తున్నారు. 

Hyderabad Software Employees Caught in Drug Supply case - bsb
Author
Hyderabad, First Published Dec 3, 2020, 11:44 AM IST

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న యువకులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సాప్ట్ వేర్ ఇంజనీర్లు ప్రముఖ కంపెనీల్లో మంచి వేతనాలకే పనిచేస్తున్నారు. 

చెడు వ్యసనాలు, ఇంకా డబ్బు సంపాదించాలన్న యావ వారిని డ్రగ్స్ దందాలోకి దింపింది. ఇప్పుడు జైల్లో పడేలా చేసింది. మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి, వనస్థలిపురానికి చెందిన మేక సాయి విపిన్, ఘట్ కేసర్, సింగపూర్ టౌన్ షిప్ కి చెందిన హర్షవర్థన్ అనే ముగ్గురు ఐటీ ఉద్యోగులు గోవా, విశాఖ ఏజేన్సీల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.

వీరు మాదకద్రవ్యాలు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏఈఎస్ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం తార్నాకలో కాపు వేసింది. బైకుపై వస్తున్న శివసేనారెడ్డి, సాయి విపిన్ లను ఆపి తనిఖీ చేయగా వారి దగ్గర 150 మైక్రోగ్రాముల చొప్పున 56 ఎల్ఎస్ డీ బ్లాట్స్, 12 గ్రాముల రెండు హషిష్ ఆయిల్ సీసాలు దొరికాయి.

వీరిద్దరినీ విచారించగా ఎల్ఎస్ డీ బ్లాట్స్ ను గోవానుంచి తెచ్చి ఇక్కడ ఒక్కొక్కటి రెండువేలకు అమ్మతున్నట్టు చెప్పారు. ఇక హషిష్ ఆయిల్ ను హర్షవర్థన్ నుంచి కొన్నట్టు సాయి విపిన్ ఒప్పుకున్నాడు. 

వీటిని రూ.2,500కు 12 గ్రాముల సీసా కొని రూ. 4000వేలకు అమ్ముతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సింగపూర్ టౌన్ షిప్ లోని హర్షవర్థన్ ఫ్లాట్ లో తనిఖీ చేయగా హషిష్ ఆయిల్ గుర్తించారు. ఈ ఆయిల్ ను వైజాగ్ కు చెందిన కార్తీక్ నుంచి లక్షరూపాయలకు కిలో చొప్పున కొని, ఇక్కడ 12 గ్రాములు రూ. 2,500లకు అమ్ముతున్నట్టు ఒప్పుకున్నాడు.

వీరిలో శివసేనారెడ్డి మూడేళ్ల క్రితం కూడా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు చిక్కాడు. పరారీలో ఉన్న కార్తీక్ కోసం గాలిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడుల్లో గత రెండు నెలల్లో పదిమంది దొరికారు. వీరంతా చదువుకునే రోజుల్లోనే గంజాయికి అలవాటు పడి, ఆ తర్వాత సప్లయర్లుగా మారారని అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios