Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఈయర్ వేడుకల వేళ అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు.. రూ. 3 కోట్ల డ్రగ్స్ స్వాధీనం ..

హైదరాబాద్‌ నగరంలో మరో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకన్నారు.

Hyderabad police arrested two and size 3 crore worth drugs
Author
First Published Dec 24, 2022, 2:40 PM IST

హైదరాబాద్‌ నగరంలో మరో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకన్నారు. చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి నార్త్‌జోన్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టైంది. ఈ ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలో వీరు ఎక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. నిందితులను పోలీసులు ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios