హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఛార్జీ షీటు దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది.

రెండేళ్ల కాలంలో 12 డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8 కేసులకు సంబంధించి ఛార్జీ షీటులు దాఖలయ్యాయి. జాబితాలో 72 మంది పేర్లున్నాయి. టాలీవుడ్‌కు సంబంధించిన నాలుగు కేసులపై ఎక్సైజ్ శాఖ సమాచారం ఇవ్వలేదు.

జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు ఛార్జీషీటులో ఎక్సైజ్ శాఖ తెలిపింది. మిగిలిన నాలుగు కేసుల్లో ఇప్పటికీ అడ్రస్ లేని ఛార్జ్‌షీటు నమోదు చేశారు అధికారులు.

వీటిలో పూరి జగన్నాథ్, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్,  ఛార్మీ,  ముమైత్ ఖాన్, రవితేజ, తనీష్, నందు వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన వారి పేర్లు లేకపోవడంపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది.