Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి ఓ కొలిక్కి:14న సీట్లతో సహా అభ్యర్థుల ప్రకటన

 మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలోని పార్టీల మధ్య సమన్వయం ఓ కొలిక్కి వచ్చినట్లుంది. మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

Final stage in mahakutami seats issues
Author
Hyderabad, First Published Nov 11, 2018, 6:53 PM IST

 

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలోని పార్టీల మధ్య సమన్వయం ఓ కొలిక్కి వచ్చినట్లుంది. మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణం, నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును మహాకూటమి వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస సమావేశాలకు శ్రీకారం చుట్టింది. 

మహాకూటమిలో సీట్లు దక్కని వాళ్లకు ఎమ్మెల్సీ, మరియు నామినేటెడ్ పదవులు ఇస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  టీజేఎస్ పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. 

అమరవీరుల ఆశయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పాలించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల దగ్గర గుప్పెడు మట్టి వెయ్యకుండా ప్రాజెక్టులు పూర్తి చేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలకు పాల్పడ్డ అమరవీరుల ఆశయాలను పట్టించుకోకుండా కేసీఆర్ పరిపాలించారన్నారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు ప్రొ.కోదండరామ్, గద్దర్, విమలక్క,ప్రొ.హరగోపాల్ వంటి నేతలను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేవలం కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశయాలను తూట్లు పొడిచేలా కేసీఆర్ ఫ్యామిలీ పాలన చేపట్టిందన్నారు. 

నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏ మాత్రం మంచి చేకూరలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాననుభావులను అగౌరవ పరిచేలా వ్యవహరించారన్నారు. 

తెలంగాణ అమరవీరులకు ఎలాంటి చేయూత ఇవ్వలేదన్నారు. అహంకారంతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఓ కుట్రలో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలు ఉండగా ఎందుకు శాసన సభను రద్దు చేశారో నేటికి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ స్పష్టం చెయ్యడం లేదన్నారు. 

బీజేపీతో కుమ్మక్కై కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసేందుకు ప్లాన్ అంటూ విరుచుకుపడ్డారు. ముస్లిం మైనారిటీలను మోసం చేస్తూ కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రాజెక్టులను ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడి దగ్గర కనీసం గుప్పెడు మట్టి కూడా వెయ్యలేని టీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను తామే పూర్తి చేశామంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

విద్యుత్ ప్రాజెక్టు నిర్మించామని చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ ఒక్క యూనిట్ అయినా విద్యుత్ అందించారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా చుక్కనీరు అయినా ఇచ్చారా అని నిలదీశారు. మిషన్ భగీరథ పేరుతో 50వేల కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు. 

తెలంగాణరాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంలో విఫలమయ్యారన్నారు. ఐఏఎస్ వ్యవస్థను నాశనం చేశారన్నారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్ కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో తాము గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

తమ ఏకైక లక్ష్యం టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమేనని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల అజెండాను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుర్మార్గ పాలనను అంతమెుందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. 

నామినేషన్ ప్రక్రియ కంటే ముందు ఏపార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అన్నది ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. డిసెంబర్ 7న జరిగే పోలింగ్ లో మహాకూటమి అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మహాకూటమి మాత్రమేనన్నారు. 

తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని అంతా కలిసి సమిష్టిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని పార్టీల భాగస్వామ్యంతో ఎన్నికలకు వెళ్తామని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
   
టీఆర్ఎస్ నుఓడించడమే లక్ష్యంగా తాము పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ గర్వంతో విర్రవీగారని అయితే తాము పొత్తు పెట్టుకుని వారి ముక్కుకి తాడు వేశామన్నారు. 

భారతదేశం చరిత్రలో తమ పొత్తుకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాజకీయాల్లో భిన్న ధృవాలైన కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయని తెలిపారు. వార్ వన్ సైడ్ అన్న కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్దతమైన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

సీట్ల సర్దుబాటుపై అటు సీపీఐ పార్టీతో ఏఐసీసీ కార్యదర్శిశ్రీనివాసన్,కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డిలు సమావేశమై చర్చించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో ఆదివారం నాడు  ఎఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, ఆ పార్టీ రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డిలు సమావేశమయ్యారు.

కాంగ్రెస్ పార్టీ తీరుపై  సీపీఐ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం మూడు సీట్లు మాత్రమే  తమకు ఇస్తామని లీకులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లను సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉంది. కొత్తగూడెం సీటు లేకుండా పొత్తు అవసరం లేదని సీపీఐ నాయకదిత్వం చెబుతోంది.

కాంగ్రెస్ తీరుపై అసహనంగా ఉన్న  సీపీఐ నాయకత్వం తాము పోటీ చేయనున్న ఐదు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ ప్రకటించింది. ఈ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సీపీఐ తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.  ఈ పరిణామాల నేపథ్యంలో సీపీఐ నాయకులతో  చర్చించేందుకు మగ్ధూం భవన్ లో  ఎఐసీసీ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి చర్చించారు. తమ డిమాండ్లను సీపీఐ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీట్ల లొల్లి: చాడతో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్ భేటీ

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

Follow Us:
Download App:
  • android
  • ios