నిజామాబాద్: లైంగిక వేధింపుల కేసులో  మాజీ మేయర్ డి.  సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేశారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం నిజామాబాద్ పోలీసుల ఎదుట  సంజయ్ హజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సంజయ్‌ను పోలీసులు విచారణ నిర్వహించారు.

విచారణ తర్వాత  పోలీసులు  సంజయ్ ను  మేజిస్ట్రేట్ ఎదుట హజరుపర్చారు.  మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు  సంజయ్ ను  జైలుకు తరలించనున్నారు.

జైలుకు తరలించే ముందు సంజయ్ కు వైద్య పరీక్షలు  నిర్వహించారు.  అయితే శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు  సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఈ విషయమై  రాష్ట్ర హోంమంత్రి  నాయిని నర్సింహ్మారెడ్డి, నిజామాబాద్ సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇవాళ విచారణకు హాజరైన  సంజయ్  ను పోలీసులు  అరెస్ట్ చేశారు