Asianet News TeluguAsianet News Telugu

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి....ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కేటీఆర్ కు రేవంత్ పలు సందర్భాల్లో చాలెంజ్ విసరగా... ఇటీవల కొడంగల్ పర్యటనలో కేటీఆర్ రేవంత్ కు సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై గెలిచి చూపించాలని...అలా చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కేటీఆర్ సవాల్ పై రేవంత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలా వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. 

congress working president revanth reddy challenge to ktr,harish
Author
Vemulawada, First Published Nov 26, 2018, 5:38 PM IST

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి....ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కేటీఆర్ కు రేవంత్ పలు సందర్భాల్లో చాలెంజ్ విసరగా... ఇటీవల కొడంగల్ పర్యటనలో కేటీఆర్ రేవంత్ కు సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై గెలిచి చూపించాలని...అలా చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కేటీఆర్ సవాల్ పై రేవంత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలా వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. 

తాజాగా సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున రేవంత్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులుచెరిగారు. తెలంగాణను నాలుడగున్నరేళ్ల పాలనలో ఎంతో అభివృద్ది చేశామనీ...అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని కేటీఆర్, హరీష్ లు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారని అన్నారు. అయితే తెలంగాణలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ది జరిగిందన్న దానిపై వారిద్దరు చర్చకు సిద్దమా అని రేవంత్ సవాల్ విసిరారు. ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున వున్న అమరవీరుల స్థూపం వద్దే చర్చిద్దాం....మీరు అందుకు సిద్దంగా ఉంటే చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

ఇక వేముల వాడ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ కేవలం సెలవుల సమయంలోనే ఇక్కడ ఉంటారని...మిగతా సమయంలో జర్మనిలోనే  ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని గెలిపించినా...ఓడించినా లాభం ఉండదని విమర్శించారు. అందువల్ల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ ప్రజల్లో వుండే ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలకు సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ప్రజలను సీఎంతో పాటు ఆయన కుటుంబం రాబందుల్లా పీక్కుతున్నారని...ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ద్వజమెత్తారు. మళ్లీ వారి చేతికి అధికారమిస్తే తెలంగాణ ప్రజలు మరోసారి దోపిడీకి గురవడం ఖాయమని రేవంత్ తెలిపారు. 

మరిన్ని వార్తలు

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios