ఆదిలాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ జోకులపై జోకులేశారు. తెలంగాణ ఆచారాలు చంద్రబాబుకు పెద్దగా తెలియవన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ చంద్రబాబుపై పంచెలు వేశారు. 

తాను చేతికి కట్టుకున్న దట్టి గురించి ప్రజలకు వివరించారు కేసీఆర్. తన చేతికి ముస్లిం సోదరులు కట్టింది దట్టీ కాదని ఇమామ్‌ జమీన్‌ అన్నారు. క్షేమంగా వెళ్లి లాభంగా రా అని బంధువులు, పెద్దలు దీవించి కట్టే పట్టీ పవిత్రమైనదని ఇమామ్ జమీన్ అని చెప్పుకొచ్చారు. 

ఇమామ్ జమీన్ గురించి ఆంధ్రావాళ్లకు తెలియదని పట్టి అని రాస్తారంటూ విమర్శించారు. తనకు ముస్లిం సోదరులు ఇమామ్ జమీన్ కట్టినప్పటి నుంచి దేశమంతా కడుతున్నారని అన్నారు. 

గతంలో చంద్రబాబు సీఎంగా, తాను మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లామని రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పాలని సూచించానని తెలిపారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైనదని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పాలని చెప్పానని తెలిపారు.  

అయితే చంద్రబాబు తాను చెప్పింది మరిచిపోయారని, ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పాల్సింది పోయి ఊద్‌ ముబారక్‌ అని చెప్పారని చెప్పుకొచ్చారు. దీంతో సభలో అంతానవ్వేశారు. దీంతో కేసీఆర్ కూడా తనకు నవ్వొస్తుందంటూ తెగ నవ్వుకున్నారు. 

తెలంగాణ రీతి, రివాజు, కల్చర్‌ చంద్రబాబుకు తెలియదని కేసీఆర్ విమర్శించారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇస్తా, పదవీవిరమణ వయసు పెంచుతా:కేసీఆర్ వరాలు

గత్యంతరం లేకేనే తెలంగాణ ఇచ్చారు:కేసీఆర్

మేము చెప్పింది అబద్ధమైతే కొట్టండి,తిట్టండి:కేసీఆర్

పట్టుపడితే మెుండిపట్టు పడతా, సాధించి తీరుతా:కేసీఆర్

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్