ఆదిలాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలో అవినీతి లేదు, మాఫియా లేదు, రౌడీ యిజం లేదు, పేకాటల క్లబ్లులు లేవు, కర్ఫ్యూలు లేవని తెలిపారు. 

నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తనతో కొట్లాడి మరీ నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడ్డారన్నారు. నిర్మల్ లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని వారికి పీఎఫ్ కార్డులు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మంత్రులు జోగు రామన్న, ఇంద్ర కరణ్ రెడ్డిల పట్టుదలతోనే నిర్మల్ జిల్లా ఏర్పడిందని తెలిపారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి కాకపోతే నిర్మల్ జిల్లా ఏర్పాటయ్యేదా కేసీఆర్ సీఎం అవ్వకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. 

నిర్మల్ జిల్లా అయ్యింది కాబట్టి నిర్మల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. తన నియోజకవర్గం గజ్వేల్ మాదిరిగానే నిర్మల్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ కు రైలు వస్తుందని, మెడికల్ కళాశాలలు వస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమేనని ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని కానీ అలాంటి పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదన్నారు. 

తెలంగాణ వాళ్లకు పాలించే తెలివితేటలు లేవని ఆంధ్రోళ్లు విమర్శించారని కానీ అద్భుతమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మేధావులు ఉన్నారని చెప్తున్నారని మరీ అక్కడ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. 

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మోదీ మాటలే తప్ప చేతల్లో ఏమీ చెయ్యడం లేదన్నారు. ప్రజలను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరినీ ఒకేలా చూసే విశాల హృదయం మోదీకి లేదన్నారు. తెలంగాణకు మోదీ సహకరించలేదన్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీతోపాటు మిగిలిన 16 మంది ఎంపీలను గెలిపించి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్ నుఏర్పాటు చేద్దామన్నారు. 

17 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాల హక్కులను సాధించుకుని తీరుతామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ముస్లిం సోదరులకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఎంఐఎం పార్టీ  సంతోషంగా ఉందన్నారు. నిర్మల్ సభలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొనాల్సి ఉందని అయితే దగుల్భాజీ రాజకీయాల వల్ల ఆయన రాలేకపోయారన్నారు. 

తనకు ముస్లిం సోదరులంటే ఎంతో గౌరవమని వాళ్లు కూడా తనను ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపారు. తాను ఎక్కడకు వెళ్లినా ముస్లిం సోదరులు తనకు అంతా లాభమే జరగాలని కోరుతూ హిమామే జామీన్ కడతారని చెప్పుకొచ్చారు. ఆంధ్రావాళ్లు దాన్ని దట్టి అంటారని అది దట్టికాదు  హిమామే జామీన్ అని తెలిపారు. 

మరోవైపు ఎవరో చెప్తున్నట్లు నిశబ్ధ విప్లవం లేదు, ఏమీ లేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గోల్ మాల్ కబుర్లు చెప్పే వాళ్లు ఎక్కువ అయ్యారని వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.  రాష్ట్రంలో పేదరికానికి కారణం ఎవరో ప్రజలు గుర్తించాలని కోరారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే వంద కొత్త పథకాలు అమలు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో తాము కడుపుకట్టుకుని నోరు కట్టుకుని పని చేశామని ఫలితంగా ఆదాయాన్ని పెంచినట్లు తెలిపారు. ఆదాయం పెరిగే కొలదీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియాను అరికట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఇసుక మీద రూ.9కోట్ల ఏభై లక్షలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లలో రూ.2వేల కోట్ల 57 లక్షలు సంపాదించినట్లు తెలిపారు. ఎంత చిత్తశుద్ధితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందో ఇదే నిదర్శనమన్నారు. ఈ డబ్బు కేవలం 50 శాతందేనని ఇంకా 50 శాతం ఇసుక అక్రమాలను అరికట్టాల్సి ఉందన్నారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

పట్టుపడితే మెుండిపట్టు పడతా, సాధించి తీరుతా:కేసీఆర్

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్