నిజామాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయమైన ఫిట్మెంట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అన్ని హామీలు నెరవేరాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు.

ఇకపై శ్రీరాంసాగర్‌ ఎండిపోదని, కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్‌ నింపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ధనిక రైతులకే రూ.2 లక్షల రుణాలు ఉంటాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.  
 

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, ముథోల్, నిర్మల్, ఇచ్చోడ నియోజకవర్గాల్లో పర్యటించారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గత్యంతరం లేకేనే తెలంగాణ ఇచ్చారు:కేసీఆర్

మేము చెప్పింది అబద్ధమైతే కొట్టండి,తిట్టండి:కేసీఆర్

పట్టుపడితే మెుండిపట్టు పడతా, సాధించి తీరుతా:కేసీఆర్

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్