ఆదిలాబాద్‌: కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేకనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపి అన్యాయం చేశారని, ఉద్యమం చేస్తే తప్పక తెలంగాణ ఇచ్చారన్నారు. 

గురువారం ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్  తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేశారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు‌, చంద్రబాబు కలిసి ఓట్ల కోసం వస్తున్నారని, పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ ఆగమవుతుందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. 
 
బాసర సరస్వతీ దేవాలయం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని గుర్తు చేశారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు డబుల్‌ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని, మళ్లీ రూ. లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. 

రైతులకు గిట్టుబాటుధర కోసం చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం పనులు కొనసాగుతున్నాయని, ఏడాది పొడవున శ్రీరాంసాగర్‌లో నీళ్లు ఉంటాయన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ వస్తానని, సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ముథోల్ టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

మేము చెప్పింది అబద్ధమైతే కొట్టండి,తిట్టండి:కేసీఆర్

పట్టుపడితే మెుండిపట్టు పడతా, సాధించి తీరుతా:కేసీఆర్

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్

చంద్రబాబును ఓసారి నేను తరిమేశాను, ఇప్పుడు మీరు: కేసీఆర్

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

రాకాసిలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినం, రిజర్వేషన్లు ఓ లెక్కా:కేసీఆర్

వదల బొమ్మాళీ: చంద్రబాబుపై మరోసారి కేసీఆర్ సెటైర్లు

సిద్దిపేట: ఐకేపీ ఉద్యోగులు, రేషన్ డీలర్లకు కేసీఆర్ వరాలు

సీతారామ ప్రాజెక్టు ఆపాలంటూ బాబు లేఖ: కేసీఆర్