తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడం..వారిపై నేతలు అసహనం వ్యక్తం చేయడం తదితర పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన అనంతరం వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు నడిరోడ్డుపై నిలదీసినా కోపగించుకోవద్దని.. ఓపిక పట్టాలని కేసీఆర్ సూచించారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన పనులు, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని స్పష్టం చేశారు. మన దరిదాపుల్లోకి కూడా ప్రతిపక్ష పార్టీలు లేవని.. దాదాపు వంద స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని.. డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ ఉంటుందని కేసీఆర్ అభ్యర్థులకు తెలిపారు.

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

టీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ భేటీ

కార్యకర్తలతో కేసీఆర్ భేటీ, నామినేషన్ ఏర్పాట్లపై చర్చ

సోనియాతో భేటీ: తెర వెనక వ్యూహరచనలో డిఎస్

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు...చితకబాదిన కార్యకర్తలు

టికెట్ నాదే, గెలుపు నాదే: టీఆర్ఎస్ నేత శంకరమ్మ ధీమా

ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం

కేసీఆర్ వ్యూహం ఖరారు: టార్గెట్ చంద్రబాబు

సర్దుబాటుకు కోమటిరెడ్డి తూట్లు: నకిరేకల్ సీటుపై తిరుగుబాటు

సర్వే: కేసీఆర్ దే ప్రభంజనం, చంద్రబాబుతో కాంగ్రెసుకు గండి