హుజూర్‌నగర్‌: హుజూర్ నగర్ నియోజకవర్గం టిక్కెట్ తనదేనని గెలుపు కూడా తనదేనని టీఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శంకరమ్మ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గడిచిన నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తలకు అండగా ఉంటూ అహర్నిశలు శ్రమించినట్లు ఆమె తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పట్ల ప్రజాదరణ పెరిగేలా చొరవ చూపడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్‌ విషయంలో తప్పక ఆలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో పార్టీలో కనీసం సభ్యత్వం లేని ఎన్‌ఆర్‌ఐ సైదిరెడ్డి తనకు టికెట్‌ వస్తుందని, పార్టీ ఎన్నికల సామాగ్రీ పంపిందని కార్యకర్తలకు చెపుతూ అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

అధిష్టానం ఎన్‌ఆర్‌ఐలకు టికెట్‌ కేటాయించాలనుకుంటే నియోజకవర్గానికి చెందిన ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధినేత అన్నెపురెడ్డి అప్పిరెడ్డికి టికెట్‌ కేటాయించాలని సూచించారు. లేదా సీనియర్‌ నాయకులు సాముల శివారెడ్డికి అయినా టికెట్ ఇవ్వాలని అలా అయితే తాము సమిష్టిగా పనిచేసి పార్టీ విజయం కోసం శ్రమిస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్న సైదిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు శంకరమ్మ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నాకు ఇచ్చినా, అప్పిరెడ్డికి ఇచ్చినా ఓకే...ఎన్నారైకి ఇస్తే చూపిస్తా: శంకరమ్మ ఆగ్రహం

ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

ఉత్తమ్ పై పోటీ ఎవరు: ఎన్నారైకి టీఆర్ఎస్ సీటు దక్కేనా?

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

‘‘నాకు టికెట్ ఇవ్వకుంటే.. సూసైడ్ చేసుకుంటా’’