ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం

ముందస్తు ఎన్నికలకు వెళ్లి... మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది.

abp c voter survey for telangana elections

ముందస్తు ఎన్నికలకు వెళ్లి... మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని సర్వే తేల్చి చెప్పింది.

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసొచ్చిందని సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వేలో మహాకూటమి 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..

అలాగే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ కేవలం 42 స్థానాలకే పరిమితమవుతుందని.. బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది. గత ఎన్నికల్లో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా పడిపోతుందని సర్వే తెలిపింది.

మహాకూటమికి 33.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా.. టీఆర్ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే సర్వేలో, పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. ఆ తర్వాతి స్థానంలో జానారెడ్డి ఉన్నారు.. ఆయన సీఎం అవ్వాలని 22.6 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.

సెప్టెంబర్‌లో మహాకూటమి ఏర్పడింది..తొలుత కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జన సమితి (టీజేఎస్) వచ్చి చేరింది. తొలుత టీఆర్ఎస్‌కు జనంలో ఊపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. 

సర్వే: కేసీఆర్ దే ప్రభంజనం, చంద్రబాబుతో కాంగ్రెసుకు గండి

ఈ సర్వే నిజమేనా: ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్?

సర్వే: కేసీఆర్‌కు అంత లేదు, మెరుగైన కాంగ్రెస్

సర్వే: వైఎస్ జగన్ ప్రభంజనం, టీడీపీకి షాక్

తెలంగాణలో పోటీకి లగడపాటి సై, పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు

కేసీఆర్‌ది గ్లాస్ సర్వే...నాది గ్రాఫ్ సర్వే: టీఆర్ఎస్ గెలిస్తే చెప్పులు మోస్తా: రాములు నాయక్

ప్రీ పోల్ సర్వే: టీఆర్ఎస్ కు 9, కాంగ్రెసుకు 6, టీడీపి మటాష్


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios