హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు‌ను  లక్ష్యంగా  టీఆర్ఎస్‌ ప్రచారం చేస్తోంది.బాబును లక్ష్యంగా చేసుకోవడం వల్ల  తెలంగాణ రాష్ట్రంలోని సెటిలర్ల ఓట్లపై ఏ మాత్రం ప్రభావం చూపదని  టీఆర్ఎస్‌ అభిప్రాయంతో ఉంది.

తెలంగాణ అసెంబ్లీ రద్దైన  తర్వాత  నిర్వహించిన ఎన్నికల సభల్లో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  లక్ష్యంగా  టీఆర్ఎస్ విరుచుకుపడింది.  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్,  మంత్రులు  కేటీఆర్, హరీష్ రావులు  బాబుపై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలోనూ, తెలంగాణ ఉద్యమంలో  చంద్రబాబునాయుడు వ్యవహరించిన  తీరును  టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణకు నష్టం చేసేలా చంద్రబాబునాయుడు  వ్యవహరించారని  టీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని  సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపుతోందోననే విషయాన్ని బేరీజు వేసుకొన్న తర్వాతే  టీఆర్ఎస్ నాయకత్వం చంద్రబాబునాయుడు లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాబును లక్ష్యంగా చేసుకొని  విమర్శలు చేస్తే  సెటిలర్ల ఓట్లపై ప్రభావం ఉంటుందా అనే విషయమై  అధ్యయనాన్ని టీఆర్ఎస్‌ చేసిందని సమాచారం.

రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతాల ఓటర్లు  అత్యధికంగా ఉన్న ప్రాంతాల నుండి సమాచారాన్ని  సేకరించిన తర్వాతే  కేసీఆర్.... బాబుపై విమర్శలను ఎక్కుపెట్టినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసుల్లో  మెజారిటీ ప్రజలు  బాబుకు సానుకూలంగా లేరని టీఆర్ఎస్ సర్వేలో తేలింది.కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన ఓటర్లలో కూడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని టీఆర్ఎస్ గుర్తించింది.  ఆ తర్వాతే బాబుపై విమర్శలను గుప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో  బాబుపై  విమర్శల తీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

సర్వే: కేసీఆర్ దే ప్రభంజనం, చంద్రబాబుతో కాంగ్రెసుకు గండి

తొందర పడి ఓ కోయిల: కేసీఆర్ మీద చంద్రబాబు పైచేయి

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్