సర్వే: కేసీఆర్ దే ప్రభంజనం, చంద్రబాబుతో కాంగ్రెసుకు గండి

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధుల్లో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. 

Survey: KCR will sweep the elections

హైదరాబాద్: తెలంగాణలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభంజనం వీస్తుందని తాజా సర్వే తేల్చింది. తాజా ఇండియా టుడే సర్వేలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి జైకొడుతున్నట్లు తేలింది. 

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధుల్లో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. 

తెలంగాణలో 75శాతం మంది ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వారంతా నమ్ముతున్నారని ఆ సర్వేలో తేలింది. 44శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. 

తాజాగా ఇండియాటుడే-పీఎస్‌ఈ సర్వేలో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉన్నట్లు స్పష్టమైంది. డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి క్లీన్‌స్వీప్ చేసే అవకాశముందని సర్వే తేల్చింది. 

ప్రతిపక్షాలు కూటమి కట్టినా ఫలితం ఉండదని ఈ శాంపిల్ సర్వే ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.  రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే కేసీఆర్ నిర్ణయం ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టిందని, ఈ దెబ్బ నుంచి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యా నిం చింది. 
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 44 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తు దని అభిప్రాయపడగా, 22శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు.

తెలంగాణలో విపక్షాలు కూటమిగా ఏర్పడినా పెద్దగా ప్రయోజనం లేదని సర్వే వెల్లడించింది. తెలుగుదేశంపార్టీతో పొత్తు ఎలాంటి అదనపు ఓట్లను రాబట్టకపోగా, అది కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తుందని తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, ఆ పార్టీతో కలయిక కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని అత్యధికులు అభిప్రాయపడినట్లు పీఎస్‌ఈ తెలిపింది. 

హైదరాబాద్‌లో ఉన్న కొద్ది పాటి కాంగ్రెస్ విజయావకాశాలకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లీస్ పార్టీ గండికొట్టే అవకాశముందని పేర్కొన్నది.

తదుపరి సీఎంగా కూడా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నవారి సంఖ్య రెండునెలల కాలంలో మూడుశాతం అదనంగా పెరిగిందని ఈ సర్వే తెలిపింది. 46శాతం మంది ఓటర్లు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని వెల్లడించింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన శాంపిల్ సర్వేలో 43శాతం మంది ఓటర్లు తదుపరి సీఎంగా కేసీఆర్‌ను కోరుకోగా, తాజా సర్వేలో వారి సంఖ్య 46శాతానికి పెరిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios