Asianet News TeluguAsianet News Telugu

సోనియాతో భేటీ: తెర వెనక వ్యూహరచనలో డిఎస్

ఫోన్ లోనే వ్యవహారాలు చక్కబెడుతారనే పేరు డిఎస్ కు ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రెండు సార్లు 2004, 2009ల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది.

DS meets Sonia gandhi to chalk out strategy
Author
New Delhi, First Published Nov 10, 2018, 3:04 PM IST

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసమ్మతి రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అధికారికంగా డిఎస్ కాంగ్రెసులో చేరలేదు. కానీ కాంగ్రెసు పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇటీవల ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన సోనియా గాంధీతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. డిఎస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని కల్వకుంట్ల కవిత సహా నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావును కోరిన విషయం తెలిసిందే. 

అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కేసిఆర్ ను కలవడానికి డిఎస్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. 

ఫోన్ లోనే వ్యవహారాలు చక్కబెడుతారనే పేరు డిఎస్ కు ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రెండు సార్లు 2004, 2009ల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. ఆ రెండు సార్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 

కాంగ్రెసును అధికారంలోకి తెచ్చిన ప్రతిఫలం డిఎస్ కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కింది. ఆ స్థితిలో వైఎస్ తో ఆయనకు విభేదాలు కూడా పొడసూపాయి. డిఎస్ నాయకులతో విస్తృతమైన సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో డిఎస్ సలహాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెర వెనక ఉండి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం కోసం ఆయన పనిచేస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

సంబంధిత వార్తలు

కాంగ్రెసులో చేరుతున్నారనే వార్తలపై డిఎస్ స్పందన

డిఎస్ కాంగ్రెసులో చేరరట: మరి ఎటు వైపు...

డిఎస్ ఇష్యూ: కేసీఆర్ వేచి చూసే ధోరణి, ఎందుకు?

డిఎస్ కు కేసీఆర్ షాక్: ఇక కథ ముగిసినట్లే

కేసిఆర్ కు నాపై ఫిర్యాదా, చేసుకోనివ్వండి: డిఎస్

డిఎస్ పై ఫిర్యాదు: కేసిఆర్ కు రాసిన లేఖ పూర్తి పాఠం

సొంత గూటికి డిఎస్?: ఆయనపై టీఆర్ఎస్ ఆరోపణలు ఇవీ...

Follow Us:
Download App:
  • android
  • ios