నిజామబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలి కొడుకును అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన సాయవ్వకు అదే మండలానికి చెందిన పోశెట్టితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది..

వీరికి కూతుళ్లు లక్ష్మీ, కవితతో పాటు సాయికుమార్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. వీరు రోడ్ల వెంబడి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే రెండేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరికి మనస్పర్ధలు రావడంతో సాయవ్వ...రాములు అనే వ్యక్తితో పరిచయమై..అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దీంతో వారిద్దరూ బోధన్‌కు మకాం మార్చి.. రాకాసిపేటలోని ఓ ప్రాంతంలో గుడిసే వేసుకుని జీవిస్తున్నారు. అయితే రాములు దీపావళీ సందర్భంగా సాయవ్వను పేకాటకు, మద్యానికి డబ్బులు కావాలని అడిగాడు..

ఆమె తన వద్ద లేవు అనేసరికి నీ కొడుకును చంపేస్తానని బెదిరించాడు. కాసేపటికి సాయవ్వ ఏదో పని మీద బయటకు వెళ్లగానే.. ఇంట్లో నిద్రపోతున్న ఆమె కుమారుడు సాయికుమార్‌ను కిరాతకంగా కొట్టి చంపి పరారయ్యాడు.

వెళ్తూ వెళ్తూ దారిలో కనిపించిన సాయవ్వకు నీ కొడుకును చంపేశానని చెప్పాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి చూసింది.. అక్కడ కొడుకు విగత జీవిగా పడివున్నాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించి.. బాబును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది..

చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి.. రాములు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

ప్రేమపెళ్లి, మరో మహిళతో వివాహేతర సంబంధం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

వదినతో వివాహేతర సంబంధం...చివరకి

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

17 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య..?

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

16 ఏళ్ల కుర్రాడితో ఎంజాయ్: అడ్డుగా ఉన్న చిన్నారిని చంపిన తల్లి

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తను చంపిన భార్య లవర్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...