పొన్నాలకు మొండిచేయి...కాంగ్రెస్‌కు 28 వేల మంది కార్యకర్తల రాజీనామా
పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్ ఇవ్వకపోవడంతో జనగామ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ తీరుకు నిరసనకు 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలోని 28 వేల మంది కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మాజీ టీపీసీసీ చీఫ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్ ఇవ్వకపోవడంతో జనగామ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ తీరుకు నిరసనకు 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలోని 28 వేల మంది కార్యకర్తలు బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖలను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు.
జనగామ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవలు చేసిన పొన్నాలకు సీటు కేటాయించకుండా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందన్నారు.
ఇందుకు నిరసనగా ఏడు మండలాల పరిధిలోని మండల, గ్రామ స్థాయి బాధ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, జనగామ మునిసిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారని తెలిపారు.
చివరి జాబితాలో పొన్నాల పేరు లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నాలుగు దశాబ్ధాలుగా జనగామ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న పొన్నాలకు టికెట్ రాకుండా పార్టీలోని ఓ వర్గం కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
పొన్నాల కాకుండా మహాకూటమి నుంచి ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని హెచ్చరించారు. కాగా, పొన్నాలకు టికెట్ రాలేదని మనస్తాపం చెందిన యువజన కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
చివరి జాబితాలోనైనా పేరుంటుందా.. ఢిల్లీ వైపు కాంగ్రెస్ ఆశావహుల చూపు
కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్
పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు
జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్
జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల
కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం
పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్
కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య
జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్
జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు