Asianet News TeluguAsianet News Telugu

ఈ అద్భుతమైన ఫీచర్లని వాట్సాప్ లో త్వరలో చూడవచ్చు.. మీరు చాట్ ఇంకా గ్రూప్‌లో మెసేజెస్ పిన్ చేయవచ్చు..

ఈ ఫీచర్ సహాయంతో, యూజర్లు వ్యక్తిగత చాట్ నుండి గ్రూప్‌కు మెసేజెస్ పిన్ చేయవచ్చు. అంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయంతో, వినియోగదారులు చాటింగ్‌లోని ముఖ్యమైన మెసేజెస్ పిన్ చేయవచ్చు, తద్వారా వాటిని ఒక్క ట్యాప్‌లో చూడవచ్చు. 

WhatsApp New Features: These amazing features will be available on WhatsApp know how it works
Author
First Published Feb 8, 2023, 3:40 PM IST

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ పిన్ చాట్ ఫీచర్‌ను విడుదల చేయబోతోంది. ఈ ఫీచర్ సహాయంతో, యూజర్లు వ్యక్తిగత చాట్ నుండి గ్రూప్‌కు మెసేజెస్ పిన్ చేయవచ్చు. అంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయంతో, వినియోగదారులు చాటింగ్‌లోని ముఖ్యమైన మెసేజెస్ పిన్ చేయవచ్చు, తద్వారా వాటిని ఒక్క ట్యాప్‌లో చూడవచ్చు. నివేదికల ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది అలాగే త్వరలో దీన్ని ప్రవేశపెట్టవచ్చు. వాట్సాప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ గురించి తాజా సమాచారం కూడా తెరపైకి వచ్చింది... 

వాట్సాప్ పిన్ చాట్ ఫీచర్
వాట్సాప్ రాబోయే ఫీచర్‌ను ట్రాక్ చేసే సైట్ WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది,  దీని ద్వారా వినియోగదారులకు చాట్‌లలో మెసేజెస్ పిన్ చేయడానికి ఉపయోగపడుతుంది, తద్వారా వినియోగదారులు క్విక్ అక్సెస్ కోసం ముఖ్యమైన మెసేజెస్ పిన్ చేయవచ్చు. మెసేజ్‌లను పిన్ చేయడం వల్ల వినియోగదారులు వారి చాట్‌లను ఆర్గనైజ్ అండ్ క్విక్ అక్సెస్ కోసం ముఖ్యమైన మెసేజెస్ హైలైట్ చేయడంలో సహాయపడతాయి. ఈ ఫీచర్ వినియోగదారులకు ఒక మెసేజ్ హైలైట్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది
WhatsApp కొత్త పిన్ చాట్ ఫీచర్ ఇప్పటికే ఉన్న కాంటాక్ట్ పిన్ ఆప్షన్ లాగే పని చేస్తుంది, ఇది వినియోగదారులను కాంటాక్ట్‌లు ఇంకా గ్రూప్స్ పిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూజర్‌లు మెసేజ్‌ని త్యాప్ చేసి పట్టుకున్న తర్వాత, పైన న్యూ పిన్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. 

కాల్ చేయడానికి షార్ట్‌కట్‌ 
వాట్సాప్ కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్‌లో వినియోగదారులు ఒకే ట్యాప్‌లో కాల్ చేసే సదుపాయాన్ని పొందుతారు. అంటే వాట్సాప్ ఓపెన్ చేయకుండానే యూజర్లు కాల్ చేయగలరు. దీనితో పాటు, వినియోగదారులు వారి కాంటాక్ట్స్ కూడా యాక్సెస్ చేయగలరు ఇంకా కాల్ చేయడానికి హోమ్ స్క్రీన్‌పై ఎవరైనా ఒక వ్యక్తిని కూడా సెట్ చేయవచ్చు. వాట్సాప్ కొత్త అప్‌డేట్ తర్వాత ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం, ఈ అప్ డేట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios