Asianet News TeluguAsianet News Telugu

ఈ ట్యాగ్ ఉంటే.. పిల్లికి మెడలో గంట కట్టినట్లే!!

ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ట్యాగ్‌ని తీసుకొచ్చాయి. ఇప్పుడు జియో కూడా అలాంటి ట్యాగ్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్ గురించి పూర్తి వివరాలు ఇదిగో..
 

This one item is enough.. JioTag Air to keep items safe.. Only Rs.1499!-sak
Author
First Published Jul 24, 2024, 9:36 AM IST | Last Updated Jul 24, 2024, 9:36 AM IST

పర్స్ ఇప్పుడే పక్కన పెట్టి మళ్ళీ  మళ్ళీ వెతుకుతుంటాము. ఇలా  మనం పదే పదే మరచిపోయే విషయాలను మిస్ కాకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ గాడ్జెట్ సహాయపడుతుంది.

ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ట్యాగ్‌ని తీసుకొచ్చాయి. ఇప్పుడు జియో కూడా అలాంటి ట్యాగ్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్ గురించి పూర్తి వివరాలు ఇదిగో..

వస్తువులను ఎక్కడ పెట్టామో మరచిపోయే వ్యక్తులకు ఈ ట్యాగ్ చాల ఉపయోగపడుతుంది. జియో ట్యాగ్ పేరుతో వస్తున్న  ఈ  గాడ్జెట్‌ను జియో లాంచ్  చేసింది. జియో ఈ ట్యాగ్‌ని బ్లూ, గ్రే & రెడ్ కలర్స్‌లో కోనవచ్చు.

ప్రస్తుతం ఈ జియో ట్యాగ్ జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే, జియోట్యాగ్ ఎయిర్ ధర రూ.1499.

ఈ ట్యాగ్ ఎలా పని చేస్తుంది? 
ఆండ్రాయిడ్ యూజర్లు  జియో థింగ్స్ యాప్ సహాయంతో ఈ డివైజ్ ఉపయోగించవచ్చు. అలాగే Apple యూజర్లు Find My Network యాప్ ద్వారా ఈ డివైజ్ ఉపయోగించవచ్చు.

ఈ ఫోన్ Android 9, iOS 14 ఇంకా  అప్ డేట్ ఫోన్‌లలో బ్లూటూత్ 5.3తో పనిచేస్తుంది. ఇందులో ఇంటర్నల్ స్పీకర్ ఉంది. ఈ ఇంటర్నల్  స్పీకర్ 90-120 db పరిధిలో సౌండ్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ చిన్న డివైజ్ బరువు 10 గ్రాములు  మాత్రమే. ఇందులోని బ్యాటరీ ఒక సంవత్సరం పాటు పని చేస్తుంది. మీ ఆబ్జెక్ట్ మొబైల్ పరిధి నుండి దూరం వెళితే మీకు వెంటనే హెచ్చరిక వస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios