Asianet News TeluguAsianet News Telugu

ఫీచర్లు అద్భుతం.. ఒకేసారి విపణిలోకి రెండు వన్‌ప్లస్‌ ’7’సిరీస్ ఫోన్లు

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ విపణిలోకి రెండు 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఒకేసారి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం హైలేట్. 
 

This launch line belongs to the OnePlus 7 Pro, not a new Apple iPhone
Author
Bengaluru, First Published May 15, 2019, 1:10 PM IST

[1:08 PM, 5/15/2019] Sai Kumar: ఫీచర్లు అద్భుతం.. ఒకేసారి విపణిలోకి రెండు వన్‌ప్లస్‌ ’7’సిరీస్ ఫోన్లు 
బెంగళూరు: అందుబాటులో ధరలో 'స్మార్ట్ ఫోన్లు’.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లంటూ వన్‌ప్లస్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘వన్‌ప్లస్‌’ నుంచి ఏడో సిరీస్‌ స్మార్ట్ ఫోన్లు మంగళవారం విడుదలయ్యాయి. 

ఒకేసారి రెండు ఫోన్ల విడుదల ఇదే ప్రథమం
వన్‌ప్లస్‌ నుంచి ఒకేసారి రెండు మొబైల్స్‌ విడుదలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీటి కోసం వన్‌ప్లస్‌ బెంగళూరు, లండన్‌, న్యూయార్క్‌లో ఒకేసారి లాంచ్‌ ఈవెంట్లు నిర్వహించింది. 

17 నుంచి అమెజాన్ లో సేల్స్ ప్రారంభం
ఇందులో వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో మొబైల్స్‌ను విపణిలోకి విడుదల చేసింది.  వీటిలో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ఉంటుంది. 
ఈ నెల 17 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు మొదలవుతాయి. 

ఎస్బీఐ కార్డుతో రూ.2000 ఇన్ స్టంట్ డిస్కౌంట్
అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఇవీ వన్‌ప్లస్‌ 7 ప్రో ప్రత్యేకతలు
6.67 అంగుళాల ఆల్‌ స్క్రీన్‌ ఫ్లూయిడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ప్లస్ 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అలాగే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ అమర్చారు. 6 జీబీ/8 జీబీ/ 12 జీబీ ర్యామ్‌లతోపాటు 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వర్షన్లలో ఫోన్లు లభిస్తాయి. 
ఇలా వన్ ప్లస్ 7 ప్రోలో కెమెరాలు
వన్ ప్లస్ 7 ప్రో ఫోన్‌లో వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. అందులో 48 ఎంపీ, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సర్‌, 8 ఎంపీ టెలీఫొటో లెన్స్‌ తో కూడిన కెమెరా, ముందువైపు 16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 

రూ.48,999 నుంచి రూ.57,999లకు 7 ప్రో ఫోన్లు లభ్యం
ఇంకా 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్లస్ 30 వాట్‌ వ్రాప్‌ ఛార్జింగ్‌ వసతి ఉంటుంది. హైడైనమిక్‌ రేంజ్‌  హెఛ్‌డీఆర్‌ 10/10+ వీడియో సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 6 జీబీ+128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 48,999... 8జీబీ+256జీబీ వర్షన్ ఫోన్ ధర రూ. 52,999.. 12 జీబీ+256 జీబీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ. 57,999గా నిర్ణయించారు. 

వన్‌ప్లస్‌ 7 ప్రత్యేకతలు ఇవీ
6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్ ప్లే ప్లస్  వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇంకా క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రోసెసర్‌ అమర్చారు. 6 జీబీ ర్యామ్‌ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ, ర్యామ్‌ ప్లస్  256 జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం దీని సొంతం. 

48 ఎంపీ ప్రధాన కెమెరా ప్లస్ మరో రెండు కెమెరాలు
వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలతోపాటు 3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ద్వారా 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఇక 6జీబీ+128 జీబీ రామ్ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.32,999, 8 జీబీ+256 జీబీ ర్యామ్ వర్షన్ ఫోన్ ధర 37,999 ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios