Apple Event: అట్టహాసంగా ఆపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’.. దిమ్మతిరిగిపోయే ఫ్యూచర్స్ తో ఐప్యాడ్ ప్రో , ఐప్యాడ్ ఎయిర్
Apple Let Loose Event : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ‘లెట్ లూస్ లాంచ్’ పేరుతో మే 7న గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ లాంచ్ ఈవెంట్ సమయంలో కొత్త ఐప్యాడ్ ప్రో 2024, ఐప్యాడ్ ఎయిర్ 2024 మోడల్‌లతో పాటు మరికొన్ని డివైజ్‌లను ఆపిల్ ఆవిష్కరించింది.
Apple Let Loose Event : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ‘లెట్ లూస్’ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్ వేదిక గా జరిగిన జరిగిన ఈ ఈవెంట్ లో కొత్త ఐప్యాడ్ ఎయిర్ తో తన ఐప్యాడ్ లైనప్ ను అప్ డేట్ చేసింది. అలాగే.. M4 చిప్, ఓల్‌ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్‌ను లాంచ్ చేసింది. ఈ తరుణంలో యాపిల్ సిఇఒ టిమ్ కుక్ మాట్లాడుతూ కొత్త ప్రొడక్ట్స్ ప్రత్యేకతలను తెలిపారు.
యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ (Apple Let Loose Event)ప్రత్యేకతలు
1. ఐప్యాడ్ ఎయిర్ (Apple iPad Air)
ఐప్యాడ్ ఎయిర్ 4 స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేయబడింది.ఈ ఐప్యాడ్ ఎయిర్ ప్రాసెసర్‌లోని AI గురించి కూడా ఆపిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. స్టీరియో స్పీకర్లు ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా ప్రవేశపెట్టిన ఐప్యాడ్ ఎయిర్ సిరీస్ లో కొత్త ఆపిల్ సిలికాన్ ఎం2 చిప్ ను తొలిసారి పొందుపర్చారు. ఎం1 ఐప్యాడ్ ఎయిర్ కంటే ఇది 50 శాతం వేగవంతమైనదని ఆపిల్ సంస్థ పేర్కొంది.
ఐప్యాడ్ ఎయిర్ మొదటిసారిగా 2 స్క్రీన్ సైజులలో అందులోకి వచ్చింది. మొదటి స్క్రీన్ 11 అంగుళాలు , రెండవది 13 అంగుళాలు లభించనున్నది. అలాగే.. ల్యాండ్‌స్కేప్ స్టీరియో ఆడియో, మ్యాజిక్ కీబోర్డ్, 5G కనెక్టివిటీ, 12MP కెమెరా , 1TB వరకు స్టోరేజ్‌లో అందుబాటులోకి రానున్నది. 11-అంగుళాల వేరియంట్ $599 నుండి అందుబాటులో ఉండగా.. 13-అంగుళాల మోడల్ ధర $799 నుంచి మార్కెట్లో లభ్యం కానున్నది. ప్రీ-ఆర్డర్‌లు నేటీ నుంచే ప్రారంభమయ్యాయి. వచ్చే వారం నుంచి మార్కెట్ లోకి రానున్నాయి.
2. ఐప్యాడ్ ప్రో
ఇక కొత్త ఐప్యాడ్ ప్రో ఫైనల్ కట్ లో అదిరిపోయే ప్యూచర్లు ఉన్నాయి.ఇందులో ఫోకస్, లైవ్ వీడియో, ఫైనల్ కట్ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఐప్యాడ్ ప్రో పాత ఐప్యాడ్ ప్రో కంటే 4 రెట్లు వేగంగా ఉంటుంది. ఐప్యాడ్ ప్రో అల్ట్రా రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానున్నది. అలాగే.. ఇందులో లభించే M4 చిప్ M2తో పోలిస్తే 40 శాతం వేగంగా పనిచేస్తుంది. అలాగే.. ఐప్యాడ్ ప్రోలో M4 చిప్‌సెట్ ఇవ్వబడుతుంది. ఇది అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నారు.
అలాగే.. అల్ట్రా హెచ్‌డిఆర్ డిస్‌ప్లే తో పాటు నానో టెక్చర్డ్ గ్లాస్ ఉంది. OLED డిస్ప్లే మొదటిసారి ఉపయోగించబడింది. ఇది ఖరీదైన డిస్ ఫ్లే ప్యానెల్ తో అందుబాటులోకి రానున్నది. దీనినే టాండమ్ OLED అంటారు. ఇది 1600 నిట్‌ల గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుంది. ఐప్యాడ్ ప్రో యొక్క 11-అంగుళాల మోడల్ 5.3 స్లిమ్ గా ఉంటుంది. అదే సమయంలో 13 అంగుళాల మోడల్ 5.1 సన్నగా ఉంటుంది. ఐప్యాడ్ ప్రో సూపర్ స్లిమ్ డిజైన్‌తో రాబోతోంది. డిజైన్ ప్రత్యేకంగా రూపొందించబడింది.
3. ఐప్యాడ్ ఎయిర్ (2024)
కొత్త ఐప్యాడ్ ఎయిర్ ను రెండు స్క్రీన్ సైజుల్లో విడుదల చేశారు. అందులో 11-అంగుళాల మోడల్ ధర USD 999 వద్ద ప్రారంభం కాగా... 13-అంగుళాల మోడల్ ధర USD 1299 వద్ద ప్రారంభమవుతుంది. ఇందులో వీడియో ఎడిటింగ్‌తో పాటు ఆడియో ఎడిటింగ్‌లో కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ మోడల్స్ లో కెమెరాను స్క్రీన్ పై ల్యాండ్ స్కేప్ ఎడ్జ్ కు మార్చారు. అలాగే..ఆ ఎడ్జ్ లోనే స్పేషియల్ ఆడియో, స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి.
4. ఆపిల్ పెన్సిల్ ప్రో
కొత్త యాపిల్ పెన్సిల్ ప్రో బ్యారెల్‌లో సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది టూల్ మెనుని యాక్సెస్ చేయడానికి వినియోగదారులను స్క్వీజ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది ఆపరేషన్ సమయంలో స్పర్శ ప్రతిచర్యలను అందించడానికి బలవంతపు అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఇప్పుడు Apple "ఫైండ్ మై" టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది తప్పుగా ఉన్నట్లయితే గుర్తించడం సులభం చేస్తుంది.
5. మేజిక్ కీబోర్డ్
అప్‌డేట్ చేయబడిన మ్యాజిక్ కీబోర్డ్‌ని దాని ప్రధాన ఫీచర్లతో సొగసైన డిజైన్ కాన్సెప్ట్‌తో ఆపిల్ దీనిని పరిచయం చేస్తోంది. కొత్త వెర్షన్‌లో ఫంక్షన్ రో, అల్యూమినియం పామ్ రెస్ట్ , హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన ట్రాక్‌ప్యాడ్ ఉన్నాయి, ఇది మ్యాక్‌బుక్‌ని ఉపయోగించడం వంటి వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది.