WhatsApp: వాట్సప్ లో షాకింగ్ ఫీచర్..! ఇకపై అలా చేస్తే శిక్ష తప్పదు!!
WhatsApp: వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్ధం ఇప్పటికే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే క్రమంలో తాజాగా మరోకొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులందరికీ మంచి అనుభవాన్ని అందించనుంది. ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp: మనిషికి, మనిషికి మధ్య ఉన్న కమ్యూనికేషన్ పెరగాలంటే కాల్స్, మెసేజ్ ఎంతో ముఖ్యం. అయితే ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో వినియోగించే చాటింగ్ యాప్ వాట్సాప్. ఎంతోమంది మదిని దోచుకున్న ఈ యాప్‌ని ఇతర యాప్‌లకు దీటుగా ఉంచేందుకు మోటా ఎంతగానో కృషి చేస్తోంది. వినియోగదారుల సౌకర్యార్ధం ఇప్పటికే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే క్రమంలో తాజాగా మరోకొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులందరికీ మంచి అనుభవాన్ని అందించనుంది. ఆ ఫీచర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
WABetaInfo ఇచ్చిన నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఖాతాను కొంత సమయం రెస్టిక్ట్ లేదా బ్లాక్ చేసే ఫీచర్ ను Meta అందించనుంది. ఇలా చేయడం ద్వారా ఎవరైనా ఖాతాదారులు ఏమైనా పొరపాట్లు చేస్తే కొంత సమయం దాకా వారి మొబైల్ నుంచి ఎలాంటి మెసేజ్ లు వేరే వారికి పంపలేరు. అలాగే ఖాతాను బ్లాక్ చేసినా వినియోగదారులు చాట్ చూడవచ్చు. అలాగే వచ్చే మెసేజ్‌లను కూడా చూడవచ్చు. అంతే కాదు బ్లాక్ లో ఉండి కూడా రిప్లై ఇవ్వవచ్చు.
WhatsApp ఎలా బ్లాక్ చేస్తుంది ?
ఇక పోతే వచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్‌లో ఎవరైనా తప్పు చేస్తే వారిని పసిగట్టేందుకు ప్రత్యేకమైన టూల్స్ ను వినియోగిస్తుంది వాట్సప్. వీటి ద్వారా వినియోగదారులు వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారా, స్పామ్‌ను పంపుతున్నారా లేదు ఒకేసమయంలో ఎక్కువ మందికి సందేశాలు పంపిస్తున్నారా చెక్ చేయవచ్చు. అయితే ఈ టూల్స్ కాల్స్ ని లేదా మీ చాటింగ్ కంటెంట్‌ను చదవలేవు.
ఈ టూల్ ద్వారా WhatsAppని ఎలా వినియోగిస్తున్నారు, తరచుగా మెసేజ్ లు పంపుతున్నాకా, ఇంకా ఏదైనా ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లను వినియోగిస్తున్నారా అనేది గుర్తిస్తుంది. దీని కోసం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను వినియోగిస్తుంది. అయితే ఎవరైనా తప్పుచేస్తే వారి ఖాతాను వాట్సాప్ పూర్తిగా నిలిపివేయదు. కేవలం కొంతసమయం మాత్రమే నిలిపివేస్తుంది. వినియోగదారులు వారు చేసిన తప్పులకు సరిదిద్దుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం.