Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి 64 ఎంపీ కెమెరాతో రియల్‌ మీ ఎక్స్‌టీ!

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ ఎక్స్ టీ పేరుతో మరో ఫోన్ విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్ కెమెరా దీని ప్రత్యేక ఆకర్షణ.

Realme XT vs Realme 5 Pro: Price in India, Specifications Compared
Author
Hyderabad, First Published Sep 14, 2019, 10:58 AM IST

దేశీయ మార్కెట్లో రెడ్ మీతోపాటు దూసుకెళుతున్న మరో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మీ మరో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రియల్‌మీ ఎక్స్‌టీ పేరుతో దీనిని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

64 మెగాఫిక్సెల్‌ కెమెరా సామర్థ్యంతో కూడిన రియల్‌మీ ఎక్స్‌టీ ఫోన్‌ను సంస్థ మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. 64 ఎంపీ సామర్థ్యం గల కెమెరాతో వస్తున్న ఫోన్ ఇదే. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ విపణిలోకి వస్తోంది. 

4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రియల్ మీ ఎక్స్ టీ ఫోన్ ధరను కంపెనీ రూ.15,999గా,  6 జీబీ విత్ 64 స్టోరేజీ జీబీ వేరియంట్‌ ధరను రూ.16,999, 8 జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ.18,999గా నిర్ణయించింది. 

పెరల్‌ బ్లూ, పెరల్‌ వైట్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్లలో సెప్టెంబర్‌ 16 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అవుతాయని సంస్థ తెలిపింది. లాంచింగ్ ఆఫర్ల కింద పేటీఎం యూపీఐ కొనుగోలుపై రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. 

దీంతోపాటు తొలి 64 వేల మంది వినియోగదారులకు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ వ్యారంటీని రియల్ మీ అందిస్తోంది. 64ఎంపీ సామర్థ్యం కలిగిన బ్యాకప్ కెమెరా ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. దీనితో 'అల్ట్రా 64 ఎంపీ'తో ఫుల్‌ రిజల్యూషన్‌లో ఫొటోలు తీయొచ్చు. దీంతోపాటు 8+ 2+ 2 ఎంపీ కెమెరాలను కూడా ఈ ఫోన్‌లో బ్యాక్‌లో అమర్చారు. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. 

ఈ కొత్తఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌తో పనిచేస్తోంది. ఇది 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగి ముందూ, వెనుక కార్నింగ్‌ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌తో ఏర్పాటైంది. స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌, 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 20 వాట్ల వూక్ చార్జింగ్ 3.0 సపోర్ట్‌తో కలిగి ఉంటుంది. 

టైప్‌-సీ పోర్ట్‌, 3.5ఎంఎం ఆడియో జాక్‌, బ్లూటూత్‌ 5.0 తదితర వసతులు రియల్ మీ ఎక్స్ టీ ఫోన్‌ను విపణిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్‌తో పాటు సరికొత్త పవర్‌ బ్యాంక్‌ను, బ్లూటూత్‌ వైర్‌లెస్‌ బడ్స్‌ను కూడా రియల్‌మీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్ తోపాటు విడుదల చేసిన పవర్ బ్యాంక్ ధర రూ.1299, ఇయర్ బడ్స్ ధర రూ.1799గా రియల్ మీ నిర్ణయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios