ఏటా కొత్త ఐఫోన్ కొనాల్సిందేనా.. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఏం చెప్పారంటే ?
మీరు ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కొనాల్సిందేనా ? మీరు దీని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ Apple CEO టిమ్ కుక్‌ని ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికిలా సమాధానం ఇచ్చాడు.
టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్లను లాంచ్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా దాదాపు 4 నుండి 5 ఐఫోన్ల మోడల్స్ విడుదల అవుతాయి. చాలా మంది ప్రతి సంవత్సరం వారి ఐఫోన్‌ను మారుస్తుంటారు. మీలో చాలా మందికి ఈ అలవాటు ఉండవచ్చు, కానీ మీరు ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కొనాలా ? మీరు దీని గురించి అంతగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ Apple CEO టిమ్ కుక్‌ని ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఇచ్చాడు. అయితే ఏం చెప్పాడో తెలుసా ?
ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను ఎందుకు లాంచ్ చేస్తుంది?
ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఫోన్‌ను ఎందుకు విడుదల చేస్తుందో తెలుసా..? గత ఏడాది ఒక వార్తా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇలా సమాధానమిచ్చాడు, "ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలనుకునే వారి కోసం ఇది చాలా గొప్ప విషయం."
ఇంకా ఆపిల్ పాలసీ గురించి కూడా మాట్లాడాడు, ఐఫోన్ యూజర్లు వారి పాత ఐఫోన్‌ను కొత్తదానికి మార్చుకోవడానికి అనుమతిస్తుంది. మరి ఈ పాత ఫోన్లు ఏమవుతాయి ? ఐఫోన్ గురించి ఈ ప్రశ్నకు, ‘అవి ఇప్పటికీ పనిచేస్తుంటే మేము ఆ ఫోన్లను తిరిగి విక్రయిస్తాము. ఫోన్లు పని చేయకపోతే ఆపిల్ వాటిని విడదీసి కొత్త ఐఫోన్ తయారీలో దాని భాగాలను ఉపయోగిస్తుంది’ అని టిమ్ కుక్ చెప్పారు.