బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునేవారికి బంపర్ ఆఫర్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్...హానర్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది.  హానర్ డేస్ సేల్ పేరిట అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ మే 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కొనసాగనుంది.

హానర్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా రూ.10,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే హానర్ ఫోన్ కొనుగోలుపై హానర్ బ్యాండ్ 4ను డిస్కౌంట్ ధరకు పొందొచ్చు. 

సేల్‌లో భాగంగా హానర్ 8ఎక్స్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమౌతోంది. ఇది 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.

హానర్ ప్లే స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999కే కొనొచ్చు. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. దీని అసలు ధర రూ.21,999. ఇక 6 జీబీ ర్యామ్ ఫోన్‌ను రూ.15,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో కిరిన్ 970 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఉంది.


అలాగే హానర్ 10 లైట్ ఫోన్‌ను 10,999 ప్రారంభ ధరతో కొనొచ్చు. 3 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. ఇక 4 జీబీ ర్యామ్ ధర రూ.12,999గా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో ఈ ఫోన్‌పై రూ.1,000 తగ్గింపు ఉంది. ఇందులో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక హానర్ 9ఎన్ ఫోన్‌ను రూ.9,999కు లభిస్తోంది.  ఇందులో 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999. హానర్ వ్యూ 20 ఫోన్‌ను రూ.42,999కు కాకుండా రూ.37,999కు అందుబాటులో ఉంది.